: ఆయన ఉన్నంత వరకూ మండలిలో కాలు పెట్టను... నన్నపనేని
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి ఉన్నంత వరకూ, తాను అడుగు పెట్టబోనని ప్రభుత్వ చీఫ్ విప్ నన్నపనేని రాజకుమారి చెప్పారు. నేటి మండలి సమావేశాల్లో సతీష్ రెడ్డి, నన్నపనేని మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మూతబడిన పరిశ్రమలపై చర్చలో తనకు అవకాశం ఇవ్వాలని నన్నపనేని కోరగా, సభాపతి స్థానంలోని సతీష్ రెడ్డి నిరాకరించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నన్నపనేని అధికార పక్షాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. సతీష్ రెడ్డి సభలో ఉన్నంతవరకు మండలిలో అడుగుపెట్టనంటూ ఆమె వాకౌట్ చేశారు.