: 'రాబింగ్' హుడ్ లా ఏపీ ప్రభుత్వ తీరు: భూమా అఖిలప్రియ
ఆంధ్రప్రదేశ్ లో డీజీల్, పెట్రోల్ లపై వ్యాట్ పెంపుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ శాసనసభలో ఈరోజు మాట్లాడారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు రాబింగ్ (రాబిన్ హుడ్ కాదు) హుడ్ లా ఉందని అన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినప్పటికీ ఏపీ ప్రభుత్వం వ్యాట్ విధించడం వల్ల సామాన్యులపై పెనుభారం పడుతోందన్నారు. దేశంలో ఏపీలోనే ఎక్కువగా వ్యాట్ విధిస్తున్నారని చెప్పారు. దాంతో సామాన్య ప్రజల నుంచి రైతుల వరకూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సభకు వివరించారు. రాబిన్ హుడ్ ధనవంతులను దోచుకుని ఆ సంపదను పేదలకు పంచితే... రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పేదలను దోచుకుని ఆ సంపదను సంపన్నులకు పెడుతోందని ఈ సందర్భంగా రాబిన్ హుడ్ ఉదంతాన్ని అఖిల ప్రస్తావించారు. ఇలా సర్కారు రాబింగ్ హుడ్ లా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. ఓవైపు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుంటే మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం సరికాదన్నారు.