: ఒక్కరోజులో అందుబాటులోకి వచ్చిన 160 మొబైల్ యాప్ లు
వేలూరులోని వీఐటీ యూనివర్శిటీ, చెన్నై క్యాంపస్ అరుదైన రికార్డును నమోదు చేసింది. 'ఆండ్రాయిడ్ అమేజ్' పేరిట నిర్వహించిన పోటీ అనంతరం ఒకేరోజు 160 స్మార్ట్ ఫోన్ యాప్ లను ఆవిష్కరించి రికార్డు సృష్టించింది. గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించే దిశగా వీఐటీ వర్శిటీ ఈ ప్రయత్నం చేసింది. పోటీకి ప్రపంచం నలుమూలల నుంచి ఆరు వేల మందికిపైగా పేర్లు నమోదు చేసుకున్నారు. మొత్తం 1400 మంది ఔత్సాహిక డెవలపర్లు ఈ పోటీలో పాల్గొనగా, వీరి యాప్ లను పరిశీలించిన నిపుణులు 160 అప్లికేషన్లను గుర్తించి వాటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమం ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం పొందింది.