: పట్టిసీమకు ఈ నెల 28న శంకుస్థాపన
ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టబోతున్న పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి ఈ నెల 28న శంకుస్థాపన జరగనుంది. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా దీనికి శ్రీకారం చుడతారు. ఇందుకు సంబంధించి నీటిపారుదల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు పట్టిసీమ ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇదో పిచ్చి ప్రాజెక్టని, అనవసర ప్రాజెక్టని ఆరోపిస్తున్నాయి. కానీ రాయలసీమకు నీరందించేందుకే ఈ ప్రాజెక్టును చేపడుతున్నామని, సంవత్సరంలో పట్టిసీమను పూర్తిచేస్తామని ఏపీ ప్రభుత్వం శాసనసభలో స్పష్టం చేసింది.