: ఆఫీసులకు బికినీలనూ అనుమతించాల్సిందే... గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్య


సాంస్కృతిక శాఖ సిబ్బందికి డ్రెస్ కోడ్ అంటూ గోవా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే అలెక్సియో రెజినాల్డో లారెంకో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు వారికి ఇష్టమైన దుస్తులతో వచ్చేందుకు వెసులుబాటు కల్పించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలూ చేశారు. ‘‘ఉద్యోగులు వారికిష్టమైన దుస్తులు ధరించే వెసులుబాటు కల్పించాలి. చివరకు బికినీతో వచ్చినా అనుమతించాల్సిందే’’ అని ఆయన వ్యాఖ్యానించారు. గోవా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న క్రమంలో నేటి ఉదయం ఆయన అసెంబ్లీ ప్రాంగణంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించాలన్న సాంస్కృతిక శాఖ మంత్రి దయానంద్ మంద్రేకర్ ‘‘ఈ విషయంపై తర్వాత మాట్లాడదాం’’ అంటూ మాట దాటేశారు.

  • Loading...

More Telugu News