: గ్రేటర్ ఎన్నికల్లో మా సత్తా చూపిస్తాం: మంత్రి తుమ్మల


ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఓడిపోవడంతో భంగపడిన టీఆర్ఎస్, తెలంగాణ ప్రభుత్వం రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో పుంజుకోవాలనుకుంటోంది. ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో టీఆర్ఎస్ పార్టీకి సంస్థాగత నిర్మాణం లేదన్నారు. అయితే ప్రతిపక్షాలన్నీ ఏకమైనా చాలా ఎక్కువ సంఖ్యలోనే తమ అభ్యర్థి దేవీప్రసాద్ కి ఓట్లు వచ్చాయన్నారు.

  • Loading...

More Telugu News