: పాకిస్థాన్, చైనా మాదిరిగా యువ కమాండర్లు కావాలి... సుప్రీంకోర్టుకు తెలిపిన భారత సైన్యం


భారత సైన్యంలో వయసు మీరిన వారు కల్నల్స్ గా విధులు నిర్వహిస్తున్నారని, ఈ విషయంలో పాకిస్థాన్, చైనాలు అనుసరిస్తున్న విధానాల మాదిరిగా సైన్యానికి ప్రమోషన్లు ఉండాలని ఇండియన్ ఆర్మీ సుప్రీంకోర్టుకు వెల్లడించింది. 2009లో ప్రవేశపెట్టిన ప్రమోషన్ విధానానికి మార్పులు కూడదని తెలిపింది. చైనా, పాకిస్థాన్ సైన్యంలో కల్నల్ స్థాయి ర్యాంకర్ సగటు వయసు 37గా, ఇజ్రాయిల్ లో 32గా ఉండగా, ఇండియాలో అది 41 సంవత్సరాలుగా ఉందని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి కోర్టుకు తెలిపారు. అందువల్లే 1999 కార్గిల్ యుద్ధంలో భారత్ నిదానంగా స్పందించిందని ఆయన వివరించారు. సైన్యంలో యువకులకు నిర్ణయాలు తీసుకునే ప్రాధాన్యత పెరగాలని అన్నారు.

  • Loading...

More Telugu News