: టీమిండియా విజయలక్ష్యం 329... రసవత్తరంగా మారిన సెమీస్
సిడ్నీలో భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న సెమీ ఫైనల్స్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయినప్పటికీ, ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ధాటిగా ఆడటంతో, రన్ రేట్ ఏ క్షణంలో కూడా డౌన్ కాలేదు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. దీంతో, ఫైనల్లో అడుగుపెట్టాలంటే భారత్ 329 పరుగులు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. బలమైన బ్యాటింగ్ లైనప్ గల టీమిండియాకు 329 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం పెద్ద కష్టమేమీ కానప్పటికీ... ఒత్తిడికి లోనుకాకుండా ఏమేరకు రాణిస్తారనేది కాసేపట్లో తేలిపోనుంది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ లలో ఫించ్ 81, వార్నర్ 12, స్మిత్ 105, మ్యాక్స్ వెల్ 23, వాట్సన్ 28, క్లార్క్ 10, ఫాల్కనర్ 21, హాడిన్ 7 (నాటౌట్), మిచెల్ జాన్సన్ 27 (నాటౌట్) పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ 4, మోహిత్ శర్మ 2, అశ్విన్ 1 వికెట్ తీశారు.