: రాంగోపాల్ వర్మపై ‘డేరా’ అనుచరుడి ఫిర్యాదు... సుప్రీం కొట్టేసిన సెక్షన్ కింద కేసు నమోదు


బాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మపై లూధియానా పోలీసులు కేసు నమోదు చేశారు. వర్మ వివాదాస్పద ట్వీట్లపై అందిన ఫిర్యాదు మేరకు సెక్షన్ 66ఏ కింద కేసు నమోదు చేసిన పోలీసులు, వర్మకు నోటీసులు అందించేందుకు ముంబై కూడా చేరుకున్నారు. వివరాల్లోకెళితే... డేరా సచ్ఛా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీం సింగ్ అలియాస్ డేరా బాబాను రాంగోపాల్ వర్మ ‘గాడిద’గా అభివర్ణించిన సంగతి తెలిసిందే. ‘మెసెంజర్ ఆఫ్ గాడ్’ చిత్రం వివాదం నేపథ్యంలో వర్మ సదరు ట్విట్టర్ లో డేరా బాబాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నాడు నోరు మెదపని డేరా బాబా అనుచరులు, తాజాగా వర్మ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే బాబా అనుచరుడొకరు లూధియానా పోలీసులకు వర్మపై ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే, వర్మపై లూధియానా పోలీసులు నమోదు చేసిన కేసు నిలిచేలా లేదు. ఎందుకంటే, సెక్షన్ 66ఏను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది.

  • Loading...

More Telugu News