: నాలుగో వికెట్ పడగొట్టిన ఉమేష్... ఆసీస్ స్కోరు 288/6


ఈ టోర్నీ ప్రారంభం నుంచి అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకుంటున్న టీమిండియా బౌలర్ ఉమేష్ యాదవ్... ఈ రోజు ఆసీస్ తో జరుగుతున్న సెమీస్ లో కూడా తన ప్రతాపం చూపుతున్నాడు. ఇప్పటికే ఈ మ్యాచ్ లో ముగ్గుర్ని బలిగొన్న ఉమేష్, ఫాల్క్ నర్ ను క్లీన్ బౌల్డ్ చేసి తన ఖాతాలో మరో వికెట్ వేసుకున్నాడు. దీంతో, 284 పరుగుల వద్ద ఆస్ట్రేలియా 6వ వికెట్ ను కోల్పోయింది. 18 పరుగులతో క్రీజులో ఉన్న వాట్సన్ కు బ్రాడ్ హాడిన్ జత కలిశాడు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 47 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 288 పరుగులు.

  • Loading...

More Telugu News