: ఇండియాకు మరో బ్రేక్ ఇచ్చిన ఉమేష్ యాదవ్
భారత్ తో జరుగుతున్న సెమీస్ లో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. ఆదిలోనే డేవిడ్ వార్నర్ ను 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ చేసిన ఉమేష్ యాదవ్, కీలక సమయంలో ఇండియాకు మరో బ్రేక్ ఇచ్చాడు. 93 బంతుల్లో 105 పరుగులు చేసి టీమిండియాకు చుక్కలు చూపెడుతున్న స్మిత్ ను ఉమేష్ బలిగొన్నాడు. దీంతో, 197 పరుగుల వద్ద ఆసీస్ రెండో వికెట్ ను కోల్పోయింది. ఉమేష్ వేసిన బంతిని స్మిత్ హుక్ చేయగా, టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతి నేరుగా డీప్ స్క్వేర్ లెగ్ లో ఉన్న రోహిత్ శర్మ చేతుల్లోకి వెళ్లింది. దీంతో, స్మిత్ నిరాశగా పెవిలియన్ చేరాడు. స్మిత్, ఫించ్ లు రెండో వికెట్ కు 182 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం, ఫించ్ కు మ్యాక్స్ వెల్ జతకలిశాడు.