: ‘వరంగల్’ కౌంటింగ్ లో 14వ రౌండ్ పూర్తి... 11 వేల ఓట్ల ఆధిక్యంలో ‘పల్లా’


తెలంగాణ శాసనమండలి ఎన్నికలకు సంబంధించి వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల స్థానం కౌంటింగ్ లో ప్రస్తుతానికి 14 రౌండ్లు పూర్తయ్యాయి. ప్రతి రౌండ్ కు స్వల్ప ఆధిక్యం కనబరుస్తూ వస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి 14వ రౌండ్ ముగిసేసరికి 11,133 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. అయితే తొలి ప్రాధాన్యత ఓట్లలోనే ఆయన గెలుపు ఖాయమయ్యేలా లేదు. దీంతో ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కూడా అనివార్యమయ్యే అవకాశాలున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం పల్లాకు 75 వేల ఓట్లు రావాలి. అయితే ఆయన ఆ మార్కుకు చాలా దూరంలో ఉన్నారు. దీంతో ఈ ఎన్నికలో అభ్యర్థి విజయాన్ని ఖరారు చేసేందుకు ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కించాల్సి ఉందని కౌంటింగ్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కౌంటింగ్ ప్రారంభమై 26 గంటలకు పైగా సమయం గడిచింది. ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కూడా పూర్తి కావాలంటే మరితం సమయం పట్టే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News