: ప్రతి కళాకారుడు జాతీయ పురస్కారం కోరుకుంటారు: నటి శ్రద్ధాకపూర్


తాను కథానాయికగా చేసిన 'హైదర్' చిత్రానికి ఐదు జాతీయ పురస్కారాలు రావడంపై నటి శ్రద్ధా కపూర్ ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతోంది. తను కూడా ఏదో ఒక రోజు ఆ పురస్కారాన్ని పొందుతానని ధీమా వ్యక్తం చేస్తోంది. "జాతీయ పురస్కారం సాధించడం చాలా సంతృప్తికరంగా ఉంటుంది. జీవితంలో ఒక్కసారైన తాము నటించిన సినిమాల ద్వారా జాతీయ అవార్డు పొందాలని, దక్కించుకోవాలని ప్రతి కళాకారుడు అనుకుంటాడు. ఏదోఒక రోజు నా జీవితంలో అది జరుగుతుందనుకుంటున్నా" అని శ్రద్ధా ఆశాభావం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News