: అంపైర్ నిర్ణయంతో బతికిపోయిన ఫించ్... హాఫ్ సెంచరీ పూర్తి


భారత్ తో జరుగుతున్న సెమీస్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ దూకుడుగా ఆడుతున్నారు. ఈ క్రమంలో జడేజా వేసిన 23 ఓవర్ నాలుగో బంతిని ఫించ్ ముందుకు వచ్చి ఆడేందుకు ప్రయత్నించాడు. బంతి నేరుగా ఫించ్ ప్యాడ్ కు తగిలింది. దీంతో జడేజా ఎల్బీడబ్ల్యూకి అప్పీలు చేయగా... అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు. దీంతో, టీమిండియా రివ్యూ కోరింది. రివ్యూలో బంతి వికెట్లకు తాకుతున్నట్టు క్లియర్ గా కనిపించింది. అయితే, ఆఫ్ స్టంప్ లైన్ లో బంతి వెళుతుండటంతో, తుది నిర్ణయం తీసుకునే అవకాశాన్ని ఫీల్డ్ అంపైర్ కే వదిలేశాడు థర్డ్ అంపైర్. దీంతో, నాటౌట్ అనే మరోసారి అంపైర్ తెలిపాడు. అంపైర్ ప్రాణదానం చేయడంతో, పించ్ దూకుడు కొనసాగింది. ఈ క్రమంలో అతను హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం ఫించ్ 56, స్మిత్ 85 పరుగులతో ఆడుతున్నారు. ఆసీస్ స్కోరు 31 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టానికి 161 పరుగులు.

  • Loading...

More Telugu News