: చంద్రబాబు సింగపూర్ పర్యటనకు అడ్డుపడ్డ కేంద్రం... పర్యటన రద్దు చేసుకున్న బాబు


సింగపూర్ వెళ్లాలనుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు కేంద్రం అడ్డుపడింది. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది వాస్తవం. ఆయన పర్యటనకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరించింది. ఈ నెల 29న సింగపూర్ మాజీ ప్రధాని లీ'కి నివాళి అర్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశానికి వెళుతున్నారు. దేశ ప్రధాని ఏ దేశానికైనా వెళ్లే ముందు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అదే దేశానికి ఎలా వెళతారని కేంద్రం ప్రశ్నించిందని సమాచారం. ఒక వేళ చంద్రబాబు సింగపూర్ వెళ్లాలని అనుకుంటే, ప్రధాని బృందంతో పాటు వెళ్లవచ్చని సూచించింది. దీంతో, చంద్రబాబు తన పర్యటనను రద్దు చేసుకున్నారు. లేకపోతే, గత రాత్రి చంద్రబాబు సింగపూర్ బయలుదేరి వెళ్లేవారు.

  • Loading...

More Telugu News