: ఎరక్కపోయి వచ్చి... ఇరుక్కు పోయి... కువైట్‌ అడవిలో తెలంగాణ వాసుల కష్టాలు


మంచి ఉద్యోగాలు దొరుకుతాయన్న ఆశతో వేలకువేలు ఖర్చుపెట్టుకొని కువైట్‌ వెళ్లిన వారు అష్టకష్టాలు పడుతున్నారు. తెలంగాణలోని కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన తొమ్మిది మంది వారం క్రితం కువైట్‌ వెళ్లారు. కువైట్ లో ఉపాధి అవకాశాలు బాగున్నాయని లతీఫ్ అనే ఏజెంట్‌ వీరి నుంచి రూ. 80 వేల నుంచి రూ. లక్ష వరకూ వసూలు చేశాడు. జుబియా ఇంటర్నేషనల్‌ మ్యాన్‌ పవర్‌ కన్సల్టెన్సీ పేరిట వీరందరిని వారం రోజుల క్రితం కువైట్‌ పంపాడు. వీరిని నగరంలో ఉంచకుండా కువైట్‌ లోని మారుమూల అటవీ ప్రాంతానికి తరలించారు. అక్కడ ఒక్క పూట మాత్రమే భోజనం పెడుతున్నట్టు సమాచారం. వెనక్కు వెళ్లిపోదామంటే డబ్బులు లేవని, కంపెనీ యాజమానిని కలిస్తే సొంత డబ్బుతో టిక్కెట్లు కొనుగోలు చేసుకుని వెళ్లాలంటున్నాడని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వం చొరవ చూపి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

  • Loading...

More Telugu News