: టీమిండియా విజయాన్ని కాంక్షిస్తూ పూజలు... దేశవ్యాప్తంగా క్రికెట్ ఫీవర్!


సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో ఆస్ట్రేలియాతో టీమిండియా సెమీ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కావడానికి కాస్త ముందుగానే భారత్ లోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు మొదలయ్యాయి. దేశంలోని ప్రధాన నగరాల్లోని పలు ప్రాంతాల్లో మొదలైన ఈ కార్యక్రమాల్లో టీమిండియా విజయాన్ని కాంక్షిస్తూ క్రికెట్ అభిమానులు ప్రత్యేక పూజల్లో మునిగిపోయారు. మ్యాచ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ హీటెక్కింది. ప్రధాన నగరాలు, చిన్న పట్టణాలు, పల్లె సీమలు... అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా మ్యాచ్ పైనే చర్చోపచర్చలు సాగాయి. వార్తా ఛానెళ్లు ప్రత్యేక చర్చా కార్యక్రమాలను ప్రసారం చేశాయి. పిచ్ పరిస్థితులు, ఇరు జట్ల బలాలు, బలహీనతలు, విజయావకాశాలు తదితరాలపై ఆసక్తికర చర్చలు కొనసాగాయి.

  • Loading...

More Telugu News