: 12 ఏళ్ల నరకయాతనకు విముక్తి!... వీణా వాణిల ఆపరేషన్‌ కు షెడ్యూలిచ్చిన లండన్ వైద్యులు


పుట్టుకతోనే తలలు అతుక్కొని ఉన్న అవిభక్త కవలలు వీణ, వాణీలను వేరు చేసేందుకు అత్యంత కష్టతరమైన శస్త్రచికిత్స చేసేందుకు లండన్ వైద్య బృందం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ ఆపరేషన్‌ కు రూ. 15 కోట్ల వరకూ ఖర్చవుతుందని, 10 నెలల సమయం పడుతుందని లండన్ వైద్యులు నిలోఫర్ ఆసుపత్రికి నివేదిక పంపారు. గత నెలలో బ్రిటన్ లోని ‘గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్’ ఆసుపత్రి వైద్యులు హైదరాబాద్ వచ్చి కవలలపై పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆపై వీరిద్దరినీ వేరు చేయడం సాధ్యమేనని తేల్చి, నివేదిక పంపించారు. కాగా, ఇక దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. పుట్టినప్పటి నుంచి నరకయాతన అనుభవిస్తున్న ఈ చిన్నారులకు ఇప్పటికైనా విముక్తి లభిస్తుందో? లేదో? మరికొన్ని నెలల్లో తేలనుంది.

  • Loading...

More Telugu News