: రుణమాఫీపై వైసీపీ వాయిదా తీర్మానం... తిరస్కరించిన స్పీకర్ కోడెల


ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. డ్వాక్రా మహిళలు, రైతుల రుణమాఫీకి సంబంధించిన అంశాలపై చర్చకు అనుమతించాలని ప్రతిపక్ష వైసీపీ వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించింది. అయితే స్పీకర్ కోడెల శివప్రసాద్ దీనిని తిరస్కరించారు. రుణమాఫీ కీలక అంశమని, దీనిపై చర్చకు అనుమతించాల్సిందేనని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. చర్చ కోసం డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తున్నారు. దీంతో ప్రారంభమైన వెంటనే సభలో గందరగోళం నెలకొంది.

  • Loading...

More Telugu News