: 20 లక్షల మందికి ఉద్యోగాలిస్తాం: ఫ్లిప్ కార్ట్
సమీప భవిష్యత్తులో క్యాటలాగింగ్, ప్యాకేజింగ్ విభాగాల్లో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్టు ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. మొత్తం ఉద్యోగాల్లో లాజిస్టిక్స్, వేర్ హౌస్ సెగ్మెంట్లలో దాదాపు 60 శాతం ఉద్యోగాలు ఉంటాయని సంస్థ అంచనా వేసింది. తమ కంపెనీ ఉత్పత్తులను విక్రయించే వారే డ్రైవర్లు తదితర ఉద్యోగాలను కల్పిస్తారని చెబుతోంది. 2014లో 75,000 మందికి తమ సంస్థలో ఉద్యోగాలు ఇచ్చినట్టు ఫ్లిప్ కార్ట్ సీనియర్ ఉద్యోగి ఒకరు తెలిపారు. ఈ-కామర్స్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఉపాధి అవకాశాలు మరింత మెరుగు పడనున్నాయని వివరించారు. ఈ సంవత్సరం టైర్-2, టైర్-3 పట్టణాలలో 50-60 శాతం కొత్త కొలువులు ఉంటాయని వివరించారు.