: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా... యువతి మృతి, 20 మందికి గాయాలు


తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదాల బారిన పడుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. హైదరాబాదు నుంచి మదనపల్లి బయలుదేరిన ఎస్ఎస్ ట్రావెల్స్ బస్సు గత రాత్రి బోల్తా పడింది. అనంతపురం జిల్లా గుత్తి వద్ద చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఓ యువతి మృత్యువాతపడింది. బాధితురాలిని అనంతపురం జిల్లా కదిరి మండలం కాలసముద్రం వాసిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 51 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News