: ‘సెమీ’తుమీకి టీమిండియా సిద్ధం... సిడ్నీలో మరికాసేపట్లో ఆసీస్ తో మ్యాచ్!


వరల్డ్ కప్ లో భాగంగా మరికాసేపట్లో రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాతో ఈ మ్యాచ్ లో తలపడుతోంది. రెండు జట్లు మ్యాచ్ ఫేవరేట్లుగానే బరిలోకి దిగుతున్నాయి. స్పిన్ కు అనుకూలిస్తుందని భావిస్తున్న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో సాధారణంగా ఆసీస్ కంటే భారత్ కే మెరుగైన అవకాశాలున్నాయి. కీలక మ్యాచ్ నేపథ్యంలో పిచ్ ను తమకు అనుకూలంగా మలచాలన్న ఆసీస్ ఆటగాళ్ల విజ్ఞప్తిని క్యూరేటర్లు పెద్దగా పట్టించుకోనట్లు సమాచారం. ఇక జట్టు కూర్పులోనూ ఎలాంటి మార్పులు లేకుండానే ఇటు టీమిండియాతో పాటు అటు ఆసీస్ కూడా పాత జట్టుతోనే బరిలోకి దిగనున్నాయి. పిచ్ ఎలాంటిదైనా గెలిచితీరతామని టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ప్రకటించగా, భారత్ ను కట్టడి చేస్తామని ఆసీస్ జట్టు కెప్టెన్ మైఖేల్ క్లార్క్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ లో విజయం సాధించే జట్టు ఈ నెల 29న న్యూజిలాండ్ తో ఫైనల్ ఆడుతుంది.

  • Loading...

More Telugu News