: టీమిండియాదే విజయం...చెన్నై 'చాణక్య చేప' చెప్పింది


ప్రపంచకప్ లో రేపు జరగనున్న రెండోసెమీఫైనల్ పై ఎన్నో అంచనాలు, మరెన్నో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్రికెట్ ను శ్వాసించే భారతీయులు సెమీస్ లో టీమిండియా విజయం సాధించాలని కోరుకుంటుండగా, ఆసీస్ అభిమానులు ఆతిథ్య దేశానిదే విజయమని అభిప్రాయపడుతున్నారు. తాజాగా చెన్నైకి చెందిన చాణక్య చేప విజయం టీమిండియాదేనని స్పష్టం చేసింది. వరల్డ్ ఫుట్ బాల్ టోర్నీ సందర్భంగా ఆక్టోపస్ చెప్పిన జోస్యంపై పుంఖానుపుంఖాలుగా కథనాలు వెలువడడంతో, పెంపుడు జంతువులతో జోస్యం చెప్పించడం ఆనవాయతీగా మారింది. దీంతో చెన్నైలో చాణక్య చేప కూడా జోస్యం చెబుతోంది. వరల్డ్ కప్ పోటీలపై చాణక్య చేప చెప్పినది చెప్పినట్టు జరుగుతోందని దాని యజమాని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News