: టీఆర్ఎస్ దేవీ ప్రసాద్ ఓటమి...బీజేపీ రామచంద్రరావు విజయం


హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా బీజేపీకి చెందిన రామచంద్రరావు విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీ ప్రసాద్ పరాజయం పాలయ్యారు. ఇది ప్రభుత్వ వ్యతిరేకతపై వచ్చిన విజయమని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవాలు గ్రహించాలని, ప్రజలు, విద్యావంతులు ఏం కోరుకుంటున్నారో గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. దీనిపై దేవీప్రసాద్ మాట్లాడుతూ, ఓటమిపాలైనప్పటికీ, 40 వేలకు పైగా ఓట్లు వచ్చాయంటే కారణం, ప్రభుత్వంపై ఉన్న అభిమానమేనని అన్నారు.

  • Loading...

More Telugu News