: ఒకటి అధికార పక్షం, రెండోది ప్రతిపక్షం...ఏపీ ఎమ్మెల్సీలు వీరే
ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన చైతన్య రాజు పరాజయం పాలయ్యారు. వామపక్షాలకు చెందిన యూటీఎఫ్ అభ్యర్ధి రాముసూర్యారావు విజయం సాధించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీడీపీకి చెందిన రామకృష్ణ విజయం సాధించారు. దీంతో ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా అధికారపార్టీకి చెందిన వ్యక్తిని, మరొక ఎమ్మెల్సీ స్థానంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థికి విజయం కట్టబెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వినూత్నమైన తీర్పునిచ్చారు. కాగా, చైతన్యరాజు గతంలో రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కావడం విశేషం. దీంతో ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు తెలుస్తోంది.