: బాధతోనే మీడియా ముందుకు వచ్చాను: మురళీమోహన్
తనపై వస్తున్న వ్యాఖ్యలపై బాధతోనే మీడియా ముందుకు వచ్చానని సినీ నటుడు, టీడీపీ ఎంపీ మురళీ మోహన్ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజేంద్రప్రసాద్ ప్యానెల్ చేసిన వ్యాఖ్యలతో కలత చెందానని అన్నారు. 'మా' కోసం ఎంతో చేశానని ఆయన చెప్పారు. 'మా'కు సరైన ఆఫీస్ లేకపోతే, తన ఇంట్లోనే ఆఫీసును నడిపానని ఆయన తెలిపారు. ఎన్నికలు జరిగితే అంతా సర్దుకుపోతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రాజేంద్రప్రసాద్ తనను 'అన్నయ్యా' అని ఆప్యాయంగా పిలుస్తాడని ఆయన చెప్పారు. ఇదేదో రాజకీయంలా కనిపిస్తోంది కానీ, సినీ కుటుంబంలో జరిగే చిన్న విషయమని ఆయన స్పష్టం చేశారు.