: మురళీమోహన్ పై విమర్శలు గుప్పించిన రాజేంద్రప్రసాద్


మంచి మార్పు కోసమే 'మా' అధ్యక్ష పదవికి పోటీచేయాలని నిర్ణయించుకున్నానని రాజేంద్రప్రసాద్ చెప్పారు. తనతో పోటే చేసే స్థాయి, అర్హత ఎవరికీ లేవని అన్నారు. ఈ ధర్మ యుద్ధంలో మంచి చేయడానికి రావడమే తాను చేసిన పాపమా? అని ప్రశ్నించారు. సేవ చేయడానికి సంకల్పం ఉంటే చాలని భావించే వాడిని తానని తెలిపారు. హాస్యంతో సినీకళామతల్లికి సేవ చేశానని చెప్పారు. సంపాదించిన డబ్బుతో ఆస్తులు కూడబెట్టుకుంటూ, రియలెస్టేట్ వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారని... అవేవీ వారివెంట రావని మురళీమోహన్ ను ఉద్దేశించి కామెంట్ చేశారు. మా అధ్యక్షుడిగా ఉండే స్టేచర్ ప్రసాద్ కి లేదంటూ మురళీమోహన్ తనతో అన్నారని నాగబాబు చెప్పిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మాట్లాడుతూ, తన స్టేచర్ గురించి మాట్లాడే స్థాయి ఎవరికీ లేదని... ఏడు కొండలపైన తనపేరు మీద ఓ కాటేజ్ కూడా ఉందని చెప్పారు. మీడియా సమావేశంలో రాజేంద్రప్రసాద్ పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News