: ఈ నెల 27న వాజ్ పేయి, మాలవీయలకు భారతరత్న ప్రదానం


బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయికి ఈ నెల 27న దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రదానం చేయనున్నారు. ఢిల్లీలోని వాజ్ పేయి నివాసానికి స్వయంగా రాష్ట్రపతి వెళ్లి పురస్కారాన్ని బహుకరించనున్నారు. ఇదే సమయంలో పండిట్ మదన్ మోహన్ మాలవీయ తరపున ఆయన కుటుంబానికి రాష్ట్రపతి భవన్ వద్ద భారతరత్నను ప్రదానం చేస్తారు. ఈ పురస్కార ప్రధాన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేబినెట్ మంత్రులు, పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. గతేడాది డిసెంబర్ 24న వాజ్ పేయి, మాలవీయలకు ఈ పురస్కారం ప్రకటించారు.

  • Loading...

More Telugu News