: ఆంధ్రా ఎమ్మెల్యేలకు సర్కారు కానుక ... కానుకగా ఐఫోన్-6!
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలందరికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం కానుకలు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. మామూలు కానుక కాదు. సుమారు రూ. 50 వేలు విలువ చేసే యాపిల్ ఐఫోన్-6లను బహుమతిగా బాబు సర్కారు ఇవ్వనుంది. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కానుకగా ఏమి ఇవ్వాలని అభిప్రాయాలూ కోరగా, ఐఫోన్ ల వైపు అత్యధికులు మొగ్గు చూపినట్టు తెలిసింది. రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉందని చెబుతూ, విలువైన కానుకలు ఇవ్వాల్సిన అవసరం ఏంటని కూడా కొందరు ప్రశ్నించారట.