: మాపై సస్పెన్షన్ ఎత్తివేయించండి... గవర్నర్ కు టీ.టీడీపీ ఎమ్మెల్యేల వినతి
తెలంగాణ శాసనసభలో తమపై విధించిన సస్పెన్షన్ ను ఎలాగైన ఎత్తివేయించుకునేందుకు టీ.టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ ను ఈరోజు టీడీపీ ఎమ్మెల్యేలు కలసి తమపై సస్పెన్షన్ ఎత్తివేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈరోజు అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. తరువాత వారిపై ఫిర్యాదు చేసేందుకు స్పీకర్ కార్యాలయానికి వెళ్లినప్పుడు కూడా పోలీసులు, మార్షల్స్ అడ్డుకోవడంతో టీడీపీ నేతలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.