: బ్రిటన్ లో ఎంపీ కానున్న ఇన్ఫీ నారాయణమూర్తి అల్లుడు!
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తి అల్లుడు రిషి సునాక్ బ్రిటన్ పార్లమెంట్ లో ఎంపీగా అడుగుపెట్టనున్నారు. మే 7న జరిగే సాధారణ ఎన్నికల్లో రిచ్ మండ్ నియోజకవర్గం నుంచి కన్సర్వేటివ్ పార్టీ అభ్యర్థిగా ఆయన విజయం ఖాయమని తెలుస్తోంది. 34 సంవత్సరాల సునాక్ ఆక్స్ ఫర్డ్, స్టాన్ ఫోర్డ్ వర్సిటీల్లో విద్యను అభ్యసించారు. స్టాన్ ఫోర్డ్ లో చదువుకుంటున్న సమయంలో మూర్తి కుమార్తె అక్షతతో ప్రేమలో పడి 2009లో ఆమెను బెంగళూరులో వివాహం చేసుకున్నారు. ఆపై యూఎస్ లో కొంతకాలం ఉండి, తదుపరి తన తల్లిదండ్రులు నివసిస్తున్న బ్రిటన్ కు మకాం మార్చారు. కాగా, ఇన్ఫోసిస్ లో అత్యధిక వాటాలు కలిగి ఉన్న వారిలో అక్షత ఒకరు. ఆమె పేరిట 0.89 శాతం వాటాలు ఉండగా, వీటి విలువ సుమారు రూ. 2,300 కోట్లు.