: వేడి పెంచిన శ్రీరామనవమి... శ్రీనివాసానంద సరస్వతి ఆమరణ దీక్ష
రాష్ట్రం విడిపోయిన తరువాత ప్రభుత్వ లాంఛనాలతో శ్రీరామ కల్యాణం విషయంలో మరింత వేడి రాజుకుంది. విజయనగరం జిల్లాలోని రామతీర్థంలోనే శ్రీరామనవమి వేడుకలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ, శ్రీనివాసానంద సరస్వతి ఆమరణ దీక్షకు దిగారు. నేటి ఉదయం మహారాజుకోట దగ్గర ఆయన దీక్షకు దిగారు. ఆయన ఆమరణ దీక్షకు పలు సంఘాలు మద్దతు తెలిపాయి. కాగా, అభిజిత్ లగ్నంలో శ్రీరామ కల్యాణం జరగకపోతే ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని విశ్రాంత ప్రొఫెసర్ ఏవీ సుబ్బారావు హెచ్చరించారు.