: కించపరిచే వ్యాఖ్యలు మాని, ఆమెకు మద్దతు పలకండి: మోహన్ బాబు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సీనియర్ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధకు ప్రముఖ నటుడు మోహన్ బాబు మద్దతు పలికారు. ఆమెలో గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయని, ఆమె నాయకత్వంలో 'మా' అభివృద్ధి పథంలో కొనసాగుతుందని ఆయన ట్వీట్ చేశారు. ఆమెను కించపరచేలా మాట్లాడకుండా, ప్రతి ఒక్కరూ ఆమెకు మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. మహిళలను ఉన్నత పదవిలో కూర్చుండబెట్టడానికి మనందరికీ ఇది మంచి సమయమని సూచించారు. అధ్యక్ష పదవికి ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ కూడా పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.