: మధ్యప్రదేశ్ గవర్నర్ కు గుండెపోటు
మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ కు ఈ మధ్యాహ్నం గుండెపోటు వచ్చింది. హుటాహుటిన ఆయనను భోపాల్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స చేస్తున్నట్టు వైద్యులు తెలిపారు. ఆయన కుమారుడు శైలేష్ యాదవ్ ఈ ఉదయం తన సొంత ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. ఉద్యోగ నియామకాల స్కాంలో ఆయనను నిందితుడిగా పేర్కొంటూ, పోలీసులు ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. కాగా, కొడుకు మరణాన్ని రామ్ నరేష్ తట్టుకోలేకపోయారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.