: అర్జెంటుగా కేసీఆర్ ను రమ్మనండి!: కాంగ్రెస్ డిమాండ్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును తక్షణం అసెంబ్లీకి పిలిపించాలని విపక్ష కాంగ్రెస్ పార్టీ సభ్యులు పట్టుబట్టారు. తెలంగాణ శాసనసభలో మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. ముఖ్యమంత్రి సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ సభ్యులు ఎంఎల్ఏ చిన్నారెడ్డికి న్యాయం చేయాలని నినాదాలు చేస్తున్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. అయినప్పటికీ వివిధ పద్దులకు సభ ఆమోదం పలికింది. ఎటువంటి చర్చ జరగనప్పటికీ, మంత్రులు ప్రవేశ పెట్టిన పద్దులు మూజువాణీ ఓటుతో ఆమోదం పొందాయని స్పీకర్ ప్రకటించారు.