: కోల్ స్కాంలో సమన్లపై కోర్టులో మన్మోహన్ పిటిషన్
బొగ్గు క్షేత్రాల కుంభకోణం కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనకు ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు జారీచేసిన సమన్లపై ఆయన పిటిషన్ దాఖలు చేశారు. సమన్లు రద్దు చేయాలని కోరారు. కోల్ స్కాంలో నిందితుడిగా ఉన్న మన్మోహన్ ను ఏప్రిల్ 16లోగా తమ ముందు హాజరుకావాలంటూ కొన్ని రోజుల కిందట సమన్లు జారీ అయ్యాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మన్మోహన్ ను సీబీఐ విచారించిన సంగతి విదితమే.