: మొబైల్ డేటా ఆదా చేసుకునేందుకు మార్గాలివే!


మీ స్మార్ట్ ఫోన్లలో డేటా ఎక్కువగా ఖర్చు అయిపోతోందా? వస్తున్న బిల్స్ మీ జేబుకు చిల్లు పెడుతున్నాయా? మొబైల్ డేటాను నియంత్రణలో ఉంచుకోవడానికి ఈ ఐదు మార్గాలను పాటించి చూడండి. అవసరం లేని పుష్ నోటిఫికేషన్స్ ఆపాలి: పుష్ నోటిఫికేషన్స్ అదనపు డేటాను వాడుకుంటాయి. ముఖ్యంగా సామాజిక మాధ్యమ, మెస్సేజింగ్ సేవలు అందించే యాప్స్ ప్రమోషనల్ కంటెంట్ ను తీసుకుని వస్తుంటాయి. ఆండ్రాయిడ్, ఐ ఫోన్ వాడకం దారులు సిస్టం సెట్టింగ్స్ లోకి వెళ్లి పుష్ నోటిఫికేషన్స్ డిజేబుల్ చేయడం ద్వార కొంత డేటా ఆదా చేసుకోవచ్చు. డేటా యూసెజ్ పరిశీలించాలి: మార్కెట్లోకి వస్తున్న ఆండ్రాయిడ్, ఐ ఫోన్లు డేటా యూసెజ్ ని ట్రాక్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. దీని ద్వారా ఎక్కువ డేటాను వాడుతున్న యాప్స్ ఏంటో ఇట్టే తెలుసుకోవచ్చు. వాటిని ఆపడం ద్వారా డేటా మిగులుతుంది. వాట్స్ యాప్ ఆటో డౌన్ లోడ్ ఆపాలి: వాట్స్ యాప్ యూజర్లు పలు గ్రూపులతో కాంటాక్ట్ లో ఉండటం వల్ల ఆయా గ్రూప్ సభ్యులు పంపే పిక్చర్లు, వీడియో, ఆడియో ఫైల్స్ వస్తుంటాయి. మనకు అవసరం అనుకున్న వాటిని మాత్రమే డౌన్ లోడ్ చేసుకునేలా సెట్టింగ్స్ మార్చుకోవాలి. లేకుంటే వచ్చిన అన్ని ఫైల్స్ నూ ఫోన్ డౌన్ లోడ్ చేస్తుంది. డేటా యూసెజ్ పెరగడానికి ఇది కూడా ఒక కారణం. చూడాలన్నా, వినాలన్నా అఫ్ లైన్ లోనే: ఇండియాలో మొబైల్ డేటా నెట్ వర్క్ అంత బలంగా లేదు. ఏదైనా స్ట్రీమింగ్ సర్వీస్ లేదా సింక్ సేవలు పొందేలా ముందస్తు చెల్లింపులు జరిపి ఉంటే సాధ్యమైనంతవరకూ వైఫై సేవలు వాడుకొని వాటిని డౌన్ లోడ్ చేసి అఫ్ లైన్లో ఉన్నప్పుడు విని, చూసి ఆనందించడం ద్వారా డేటాను ఆదా చేసుకోవచ్చు. డేటా కంప్రజన్: మొబైల్ బ్రౌజర్ ను కంప్రెస్ చేయడం ద్వారా డేటా వాడకం తగ్గించుకోవచ్చు. గూగుల్ క్రోం, ఒపేరా వంటి బ్రౌజర్లు ఈ సేవలను అందిస్తున్నాయి. ఈ టిప్స్ పాటించడం ద్వారా మీ మొబైల్ డేటా వాడకాన్ని అదుపులో ఉంచుకొవచ్చు. మీరూ ట్రై చేయండి!

  • Loading...

More Telugu News