: కుష్బు సహా 17 మందికి ఏఐసీసీ అధికార ప్రతినిధుల హోదా
గతేడాది కాంగ్రెస్ పార్టీలో చేరిన నటి కుష్బుకు ఏఐసీసీ అధికార ప్రతినిధి హోదా దక్కింది. ఈ మేరకు 52 మందితో కూడిన ప్రతినిధుల జాబితాను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధికారికంగా ప్రకటించారు. అందులో నలుగురు సీనియర్ అధికార ప్రతినిధులు, 17 మంది కొత్త అధికార ప్రతినిధులు, 31 మంది మీడియా పానలిస్టులు, మరో ఇద్దరు మీడియా కో-ఆర్డినేటర్లను నియమించినట్టు తెలిపారు. డీఎంకే నుంచి బయటికొచ్చి పార్టీలో చేరిన కుష్బుకు పదిహేడు మంది కొత్త అధికార ప్రతినిధుల జాబితాలో ఆరో స్థానం దక్కింది. మొత్తం 44 మంది ఎంపీలున్న కాంగ్రెస్ కు 52 మంది అధికార ప్రతినిధులుండటం గమనార్హం.