: నటుడు మోహన్ బాబును సన్మానించనున్న లండన్ తెలుగు అసోసియేషన్
నటుడు, రాజకీయ నేత మంచు మోహన్ బాబును తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (టీఏఎల్) సన్మానించనుంది. నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో ఉంటూ తన విలక్షణమైన నటనతో సేవ చేసినందుకుగానూ ఈ నెల 28న లండన్ లో జరగనున్న 10వ ఉగాది వార్షికోత్సవాల సందర్భంగా ఆయనకు సన్మానం జరగనుంది. "సినీ పరిశ్రమ, విద్య, సమాజానికి మోహన్ బాబు చేసిన సేవ అసమానమైంది. సినిమాపట్ల ఆయనకున్న ప్రేమ, ఆసక్తికి గుర్తింపుగా తాల్ (టీఏఎల్) అవార్డును ప్రధానం చేయనున్నాం. ఈ పురస్కారాన్ని తీసుకునేందుకు ఆయన అంగీకరించినందుకు మేము సంతోషిస్తున్నాం" అని తాల్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాములు దాసోజు ఓ ప్రకటనలో తెలిపారు. దానిపై మోహన్ బాబు స్పందిస్తూ, ఈ సుదీర్ఘ ప్రయాణంలో తన వెంట ఉన్న కుటుంబం, స్నేహితులు, అభిమానులు అందరికీ ఈ అవార్డును అంకితమిస్తున్నట్టు చెప్పారు.