: ఫినాయిల్ వద్దు... గోమూత్రం చాలు... మేనకాగాంధీ లేఖ


ఆవు మూత్రం నుంచి తయారు చేసిన క్లీనింగ్ లిక్విడ్ తో ప్రభుత్వ కార్యాలయాలు శుభ్రం చేయాలని, రసాయనాలున్న ఫినాయిల్ వాడకానికి స్వస్తి చెప్పాలని కేంద్ర మంత్రి మేనకా గాంధీ సహచరులకు లేఖ రాశారు. పర్యావరణానికి స్నేహపూర్వకమైన 'గాన్యిల్' వాడాలని ఆమె సూచించారు. గోమూత్రం నుంచి తీసిన పదార్థాలతో కేంద్రీయ బండార్ 'గాన్యిల్'ను తయారు చేస్తోందని తెలిపారు. ప్రస్తుతం ఒక ఎన్జీఓ సంస్థ 'గాన్యిల్' మార్కెటింగ్ వ్యవహారాలు చూస్తోంది. కాగా, ఆఫీసుల్లో నేలను శుభ్రం చేసేందుకు చౌకగా లభిస్తున్న ఫినాయిల్ ను వాడుతున్నారన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News