: వ్యభిచారానికి లైసెన్సు ఇవ్వాలి: మండలిలో కాంగ్రెస్ పక్షనేత సి.రామచంద్రయ్య
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏపీ శాసనమండలిలో ఆ పార్టీ నేత సి.రామచంద్రయ్య కొద్దిసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యభిచారానికి లైసెన్సు మంజూరు చేయాలన్న ఆయన, ఈ విషయంపై సమగ్ర చర్చ జరగాలని డిమాండ్ చేశారు. మహిళలపై అత్యాచారాలు తగ్గుతాయని భావిస్తే, వ్యభిచారానికి లైసెన్సు మంజూరు చేయడమే మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. మహిళలపై నానాటికీ పెరిగిపోతున్న అత్యాచారాలపై జరిగిన చర్చలో పాల్గొన్న సందర్భంగా రామచంద్రయ్య ఈ మేరకు వ్యాఖ్యానించారు. మహిళలపై జరుగుతున్న దాడులను శాసనమండలి ముక్తకంఠంతో ఖండించింది.