: 9 మంది వైసీపీ సభ్యులపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు... అసెంబ్లీలో గందరగోళం!
ఏపీ అసెంబ్లీలో మళ్లీ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. స్పీకర్ హోదాను అగౌరవపరిచారని ఆరోపిస్తూ తొమ్మది మంది వైసీపీ ఎమ్మెల్యేలపై అధికారపక్షం సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ప్రవేశపెట్టింది. టీడీపీ ఎమ్మెల్యే అనిత ఈ నోటీసును ప్రతిపాదించారు. దీంతో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. హక్కుల ఉల్లంఘనపై అందిన నోటీసుపై చర్చ సందర్భంగా తమ నిరసనను తెలియజేయాలన్న స్పీకర్ సూచనను వైసీపీ పట్టించుకోలేదు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.