: ఆడ, ఈడ తిరిగే బదులు మా వద్దకే వచ్చి అడగొచ్చు కదా?: టీటీడీపీకి కేటీఆర్ సలహా


ఈ అసెంబ్లీ సమావేశాల సెషన్ మొత్తానికి టీటీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తమపై విధించిన సస్పెన్షన్ అన్యాయమని, వెంటనే సస్పెన్షన్ ఎత్తివేసి తమను సభలోకి అనుమతించాలని టీటీడీపీ నేతలు కోరుతున్నారు. ఈ క్రమంలో వారు గవర్నర్, స్పీకర్, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డినే కాక రాష్ట్రపతి ప్రణబ్ ను కూడా కలిశారు. ఈ వ్యవహారంపై టీఎస్ మంత్రి కేటీఆర్ సెటైర్లు విసిరారు. టీడీపీ ఎమ్మెల్యేలు ధర్నా ఎందుకు చేశారు? ధర్నా సమయంలో కింద కూర్చున్నారా? లేక సోఫాలో కూర్చున్నారా? అంటూ ఎద్దేవా చేశారు. తమ సస్పెషన్లను ఎత్తివేయాలని కోరుతూ ఆడ, ఈడ తిరిగే బదులు... తమ (ప్రభుత్వం) వద్దకు వచ్చి అడిగితే సరిపోతుంది కదా? అని సూచించారు. ఇదే విషయంపై మరో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, తమకు టీడీపీ సభ్యులపై ఎలాంటి కసి లేదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News