: ఎందుకింత బలవంతం?: ప్రభుత్వ తీరుపై జగన్ అసహనం
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం పేరు చెప్పి ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కుంటున్నదని వైకాపా అధ్యక్షుడు, విపక్ష నేత వై.ఎస్.జగన్ విమర్శించారు. ఎందుకింత బలవంతపెడుతున్నారని ప్రశ్నించారు. నేటి ఉదయం శాసనసభలో రాజధాని నిర్మాణంపై చర్చ చేపట్టాలని ఆయన పట్టుబట్టారు. సీఆర్డీఏపై గత అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాజధాని భూములపై చర్చ జరగకుంటే వాస్తవాలు ప్రజలకు ఎలా తెలుస్తాయని అడిగారు. కాగా, ఈ విషయంలో చర్చకు ప్రభుత్వం అంగీకరించలేదు.