: ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో దోపిడీ దొంగల స్వైర విహారం


ఏపీలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో గడచిన రాత్రి దోపిడీ దొంగలు స్వైరవిహారం చేశారు. ప్రకాశం జిల్లా పొదిలి మండలం కుంచేపల్లి వద్ద దోపిడీ దొంగలు ట్రాక్టర్ షోరూం మేనేజర్ విజయ్ కుమార్ పై దాడి చేశారు. అతడి వద్దనున్న రూ.37 వేల నగదును తీసుకుని, ఆ తర్వాత అతడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. దోపిడీ దొంగల దాడిలో తీవ్రంగా గాయపడ్డ సదరు ఉద్యోగి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. మరోవైపు నెల్లూరు జిల్లా భోగోలు మండలం కోవూరిపల్లి వద్ద పెట్రోల్ బంకుపై దోపిడీ దొంగలు దాడి చేశారు. అక్కడ క్యాషియర్ గా పనిచేస్తున్న కోదండరామిరెడ్డిపై దాడి చేసి రూ. 2.7 లక్షలు లాక్కెళ్లారు. దోపిడీ దొంగల దాడిలో కోదండరామిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News