: జట్టును ధోనీ మలిచిన తీరు అద్భుతం: ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం మైఖేల్ వాన్
టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీపై ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం మైఖేల్ వాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. వరల్డ్ కప్ లో విజయాలు ఎలా సాధించాలో ధోనీకి బాగా తెలుసన్న వాన్, టీమిండియాను ధోనీ మలిచిన తీరు అద్భుతమంటూ కీర్తించాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు, వన్డే సిరీస్ ల తర్వాత టీమిండియాను ధోనీ దుర్బేధ్యంగా మలిచాడని వాన్ పేర్కొన్నాడు. ఆ కారణంగానే వరల్డ్ కప్ లో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగిస్తోందని వ్యాఖ్యానించాడు. తనదైన టెక్నిక్ తో రాణిస్తున్న భారత బ్యాట్స్ మన్ అజింక్యా రెహానే, భవిష్యత్ లో టీమిండియా బ్యాటింగ్ కు వెన్నెముకలా మారతాడని వాన్ చెప్పాడు. సెమీస్ లో టీమిండియా స్పిన్ ను ఏ మేరకు ఎదుర్కొంటుందన్న దానిపైనే ఆసీస్ విజయం ఆధారపడి ఉంటుందని అతడు వ్యాఖ్యానించాడు.