: ‘మండలి’ ఎన్నికల్లో విజేతలెవరో?... మరికాసేపట్లో ఓట్ల లెక్కింపు


తెలుగు రాష్ట్రాల్లో రసవత్తరంగా సాగిన శాసనమండలి ఎన్నికల్లో విజేతలెవరో నేడు తేలిపోనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మండలి ఎన్నికల్లో తమ అభ్యర్థుల విజయం కోసం ఆయా పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. భారీ ఎత్తున డబ్బు, మద్యం ఏరులై పారింది. ఏపీలో రెండు టీచర్, తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షాలు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలనూ ఆశ్రయించాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. ఏపీలో అధికార పార్టీ బలపరచిన అభ్యర్ధుల విజయం ఖాయంగానే కనిపిస్తున్నా, తెలంగాణలో మాత్రం గెలుపు అటు అధికార టీఆర్ఎస్ తో పాటు ఇటు విపక్ష బీజేపీ అభ్యర్థులను ఊరిస్తోంది. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరచిన అభ్యర్థులకు బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది.

  • Loading...

More Telugu News