: తెలంగాణ సచివాలయ నిర్మాణానికి 150 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం


హైదరాబాదు, ఎర్రగడ్డలోని చెస్ట్ ఆసుపత్రి ప్రాంగణంలో తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణం నిమిత్తం ప్రభుత్వం 150 కోట్ల రూపాయలను విడుదల చేసింది. చెస్ట్ ఆసుపత్రిలో భవన నిర్మాణ పర్యవేక్షణకు ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఓ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలోని 72 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న కొత్త సచివాలయంలో అసెంబ్లీ, ఇతర శాఖల, ఉన్నతాధికారుల, హెచ్ఓడీల ఆఫీసులన్నీ కొలువుతీరనున్నాయి. ముఖ్యమంత్రి నివాసం, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నివాసాలు కూడా ఇదే ప్రాంగణంలో ఉండేలా నిర్మాణాలు చేపట్టనున్నారు. నిర్మాణాలు పూర్తైన అనంతరం అత్యాధునిక, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. కాగా, చెస్ట్ ఆసుపత్రిలో సచివాలయ నిర్మాణానికి ప్రతిపక్షాలు అభ్యంతరం చెబుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News