: పైలట్ అనుభవజ్ఞుడు...ఎందుకిలా జరిగిందో తెలుసుకుంటాం: 'జర్మన్ వింగ్స్'


ఫ్రాన్స్ లోని ఆల్ఫ్స్ పర్వతాల్లో కూలిపోయిన ఎయిర్ బస్ విమాన పైలట్ కు పది సంవత్సరాలకు పైగా అనుభవం ఉందని 'జర్మన్ వింగ్స్' విమానయాన సంస్థ తెలిపింది. విమాన ప్రమాద ఘటనపై సంతాపం వ్యక్తం చేసిన 'జర్మన్ వింగ్స్'... పైలట్ అనుభవం, విమానం కండిషన్ పై మాట్లాడుతూ, పైలట్ కు ఆరువేల గంటలకు పైగా విమానం నడిపిన అనుభవం ఉందని తెలిపింది. విమానానికి కొద్ది రోజుల క్రితమే తనిఖీలు నిర్వహించినట్టు పేర్కొంది. అయితే, ప్రమాదం ఎందుకు జరిగిందో తెలుసుకుంటామని సంస్థ తెలిపింది.

  • Loading...

More Telugu News