: భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు స్పూర్తిగా గుజరాత్ అసెంబ్లీలో ఆల్కహాల్ దాడి


స్వాతంత్ర్యం కోసం ప్రాణాలకు తెగించి, ఢిల్లీ అసెంబ్లీ హాల్ లో నాటుబాంబులు విసిరి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు స్పూర్తితో వారి సంస్మరణ దినోత్సవం నాడు, గుజరాత్ అసెంబ్లీలో ఆల్కహాల్ వ్యతిరేక ఉద్యమకారుడు శంకర్ దాస్ పటేల్ ఆల్కహాల్ దాడికి పాల్పడ్డాడు. 70 ఏళ్ల పటేల్ ప్లాస్టిక్ సంచిలో ఆల్కహాల్ నింపుకుని అసెంబ్లీ ప్రేక్షకుల గ్యాలరీలోకి ప్రవేశించాడు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతుండగా, ఆల్కహాల్ సంచిని శాసనసభలోకి విసిరేసి, కరపత్రాలు విరజిమ్మాడు. రాష్ట్రంలో మధ్య నిషేధం సంపూర్ణంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్, స్పీకర్, సభ్యులను కరపత్రాల్లో కోరాడు.

  • Loading...

More Telugu News